రానున్న అమితాబ్ బచ్చన్ సినిమాలు
ప్రభాస్, దిశా పటానీ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకోన్ లతో కలిసి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కనిపించనున్నారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ‘ . అలాగే, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టైయన్ చిత్రంతో తమిళంలోనూ అమితాబ్ ఆరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు. మరోవైపు, రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం బటర్ ఫ్లై కోసం ప్లేబ్యాక్ సింగింగ్ వైపు కూడా అమితాబ్ వెళ్లాడు. ఈ చిత్రంలో పరుల్ యాదవ్, ఎల్లీ అవ్రామ్ నటించారు.