Yata Satyanarayana Razakar Movie: పాపులర్ యాక్టర్ బాబీ సింహా, హీరోయిన్ వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, నటి ఇంద్రజ, బాలీవుడ్ యాక్టర్ మకరంద్ దేశ్ పాండే నటించిన సినిమా రజాకార్. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీలో మార్చి 15న రజాకార్ మూవీ విడుదలైంది.