2024 ఎన్నికలను చంద్రబాబు ( Chandrababu )చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తగు జాగ్రత్తలు వహిస్తున్నారు.
దీనిలో భాగంగా ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ఇదే సమయంలో బీజేపీతో( BJP ) కూడా కలిసి అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు.
దీంతో టికెట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) నాయకులు అభద్రతాభావంతో ఉన్నారు.అంతేకాకుండా కొంతమంది నాయకులు పొత్తుల విషయంలో నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో చంద్రబాబు అలర్ట్ అయ్యి సంచలన ప్రకటన చేయడం జరిగింది.
విషయంలోకి వెళ్తే పొత్తులకు సంబంధించి సహకరించే నాయకులకు అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.ఇదే సమయంలో టికెట్ రాని నాయకులు నిరుత్సాహపడొద్దని సూచించారు.చాలామంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామంటున్నారు.
పార్టీకి ఉపయోగపడతారు.అనుకునే వారిని తీసుకుంటాం.వారితో పార్టీ నాయకులు కలిసి పని చేయాలి.“రా కదలిరా” సభలు ముగిసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా చైతన్య యాత్ర”( “Praja Chaitanya Yatra” ) ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు తెలియజేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలలలో జరగబోయే ఎన్నికలకి సంబంధించి చంద్రబాబు సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో గెలవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు.దీంతో ఏమాత్రం అధికార పక్షానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.