Home తెలంగాణ ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ .. రాష్ట్ర బడ్జెట్‌కి ఆమోదం-telangana vote on account budget...

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ .. రాష్ట్ర బడ్జెట్‌కి ఆమోదం-telangana vote on account budget live updates 2024 ,తెలంగాణ న్యూస్

0

తెలంగాణ బడ్జెట్ 2024(https://legislature.telangana.gov.in/)

Telangana Budget 2024 Live Updates: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టనుంది. ఉదయం భేటీ అయిన మంత్రివర్గం…. పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

Sat, 10 Feb 202404:33 AM IST

2009లో ఎమ్మెల్యేగా…..

తొలిసారి 2009లో శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన విక్రమార్క 2018 నుంచి 2023 వరకు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అత్యంత కీలకమైన ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Sat, 10 Feb 202404:33 AM IST

ఖమ్మం జిల్లా నుంచి తొలి వ్యక్తి

మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆర్ధిక శాఖా మంత్రిగా రాష్ట్ర తొలి పద్దు(Telangana Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఇది ఒక అరుదైన గౌరవంగానే విశ్లేషకులు చర్చిస్తున్నారు.

Sat, 10 Feb 202404:31 AM IST

భట్టి కామెంట్స్….

బడ్జెట్ లో అన్ని అంశాలు ఉంటాయన్నారు ఆర్థిక మంత్రి భట్టి. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న ఆయన… ఆస్తులు.. అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయంపైనా బడ్జెట్‌ ప్రసంగంలో ఉంటాయని చెప్పుకొచ్చారు.

Sat, 10 Feb 202404:29 AM IST

ఆరు గ్యారెంటీలు – సంక్షేమం

ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది కాంగ్రెస్. వీటిలోని పలు అంశాలకు సంబంధించి కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. విద్యుత్, వ్యవసాయం, పంచాయితీరాజ్ తో పాటు పలు శాఖలకు అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉంది.

Sat, 10 Feb 202404:28 AM IST

ఆ తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్…

పార్లమెంట్ ఎన్నికల తర్వాత…. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని బీఏసీలో సమావేశంలో కూడా చర్చించారు.

Sat, 10 Feb 202404:28 AM IST

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలు లేకుండా కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం.

Sat, 10 Feb 202404:28 AM IST

ప్రవేశపెట్టనున్న భట్టి…..

శనివారం మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క(Finance Minister Mallu Bhatti Vikramarka) అసెంబ్లీ ముందుకు పద్దను తీసుకురానుండగా… మరోవైపు శాసన మండలిలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు ప్రవేశపెట్టనున్నారు.

Sat, 10 Feb 202404:30 AM IST

ఈసారి ఎంత ఉండొచ్చంటే…

ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో ఉండనున్నాయి. ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది సర్కార్.

Sat, 10 Feb 202404:24 AM IST

బడ్జెట్ కు ఆమోదం

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టనుంది. ఉదయం భేటీ అయిన మంత్రివర్గం…. పద్దుకు ఆమోదముద్ర వేసింది.

Exit mobile version