ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉద్దండులు..
ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది ఉద్దండులు మంత్రులుగా పని చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిథ్యం వహించగా గడచిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత కొత్తగా మరో ఇద్దరు మంత్రులుగా స్థానం సంపాదించారు. జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు ఖమ్మం నుంచి మంత్రులుగా పని చేయగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో తొలిసారిగా మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేశారు. నందమూరి తారక రామారావు, చంద్రబాబు, కేసిఆర్ మంత్రి వర్గంలో పని చేయడమే గాక ప్రస్తుతం రేవంత్ మంత్రి వర్గంలో సైతం వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రితో పాటు వివిధ ప్రధాన శాఖలు నిర్వహించినప్పటికీ ఆర్థిక శాఖను మాత్రం జిల్లాకు చెందిన ఎవరు నిర్వహించ లేదు. తొలిసారి మల్లు భట్టి విక్రమార్కకు ఆ అవకాశం దక్కింది.