Home తెలంగాణ కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం, టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల-hyderabad news in telugu...

కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం, టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల-hyderabad news in telugu ts govt released 40 crores pending bills to tspsc ,తెలంగాణ న్యూస్

0

గ్రూప్ -2,3 పోస్టులు కూడా పెంపు?

గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకల వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురై ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ ఆ పొరపాట్లు జరగకుండా నిరుద్యోగులకు తమ ప్రభుత్వంపై నమ్మకం కుదిరెలా కొత్త ఉద్యోగుల భర్తీకి అంతా సిద్ధం చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అది కూడా లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విలువడే లోపే జరగాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో రద్దైన గ్రూప్ -1 నోటిఫికేషన్ కొత్తగా చేర్చిన 60 పోస్టులతో కలిపి రీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం హయంలో వెలువడిన గ్రూప్ 2 , గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా రద్దు చేసి వాటికి కొన్ని కొత్త పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది గ్రూప్ -4 నోటిఫికేషన్ కు సంబంధించి ఫింగర్ ప్రింట్ తీసుకోకపోవడం, పరీక్ష నిర్వహించడంలో లోపాలు సహా కొన్ని వివాదాలు నేపథ్యంలో….. నోటిఫికేషన్ రద్దు చేయాలా లేక ఫలితాలు వెల్లడించాలనే సందిగ్ధంలో టీఎస్పీఎస్సీ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏదో ఒక రూపంలో శుభవార్త చెప్పాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది.

Exit mobile version