IRCTC Divya Dakshin Yatra : ఐఆర్సీటీసీ(IRCTC) అతి తక్కువ ధరలో “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర” టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో 9 రోజుల్లో(8 రాత్రులు/9 రోజులు) ఏడు దివ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం,తిరుచ్చి, తంజావూరు దివ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర” టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు https://www.irctctourism.com/tourpkgs వెబ్ సైట్ లో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.