Home Uncategorized అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవ్ – పట్టణ సీఐ సంతోష్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవ్ – పట్టణ సీఐ సంతోష్ కుమార్

0

తాండూర్ ఫిబ్రవరి 5 జనవాహిని న్యూస్ :- ప్రభుత్వ అనుమతులు లేనిదే అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క ట్రాక్టర్ కు రూ 600లను ప్రభుత్వం పేరున డిడి చెల్లించి ఇసుక తరలించేందుకు అనుమతులు పొందాలని అవకాశం ఇచ్చినప్పటికీ కొందరు అక్రమంగా ఇసుక తరలించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. సోమవారం రోజు తాండూర్ మండలం ఖంజాపూర్ గ్రామ శివారులోని కాగ్నా నదిలో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 34 టిఎ 9701, ట్రాలీ నెంబర్ టిఎస్ 34 టిఎ 9702 గల ట్రాక్టర్ లో డ్రైవర్ శ్రీకాంత్,అలాగే ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 34 టీబీ 1709, ట్రాలీ నెంబర్ టిఎస్ 34 టీబీ 1708 గల ట్రాక్టర్ లో డ్రైవర్ వర్త్య సోమే నాయక్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అట్టి ట్రాక్టర్ల ను పట్టు కుని డ్రైవర్ల పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఒక ప్రకటనలు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా రూ 600 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్ళడం కోసం అవకాశం కల్పించినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించడంతో రెండు ట్రాక్టర్ల డ్రైవర్ల పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

Exit mobile version