Home తెలంగాణ తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, తండ్రిని హత్య చేసిన కొడుకు-sangareddy crime news in telugu son...

తాగొచ్చి తల్లిని కొడుతున్నాడని, తండ్రిని హత్య చేసిన కొడుకు-sangareddy crime news in telugu son murdered drunk father beating mother every day ,తెలంగాణ న్యూస్

0

Sangareddy Crime : మద్యం మహమ్మారి రోజు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. మద్యం మత్తులో కన్ను మిన్ను ఎరుగక, కట్టుకున్న భార్యను ప్రతిరోజు హింసిస్తున్న ఒక వ్యక్తి , తన కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి ప్రతిరోజు మద్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడనే క్షణికావేశంలో కొడుకు తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన కొంచెం కృష్ణా రెడ్డి (48) ప్రతిరోజు మద్యం తాగివచ్చి కుటుంబసభ్యులతో గొడవపడటం, భార్యపై చేయి చేసుకోవడం చేస్తుండేవాడు. తన కుమారుడు, ఇరుగుపొరుగు వారు ఎంతచెప్పినా వినిపించుకునేవాడు కాదు . ఇలాగే నిత్యం తాగి వస్తూ, ఏ పని చేయకుండా తిరుగుతూ కుటుంబాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు.

Exit mobile version