Home ఎంటర్టైన్మెంట్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై చిరంజీవి సినిమాలు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై చిరంజీవి సినిమాలు

0

దేశ విదేశాల్లో అభిమానులని సంపాదించుకున్న ఇండియన్ హీరోలలో  చిరంజీవి కూడా ఒకరు. రెండున్నర దశాబ్దాలపై నుంచే ఆయనకీ వేరే దేశాల్లో కూడా  లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకీ కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యంత  ప్రతిష్టాత్మికమైన పద్మ విభూషణ్ ని ప్రకటించింది. ఈ సందర్భంగా  చిరు చేసిన ఫ్యాన్స్  ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.

న్యూయార్క్ కి చెందిన చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా  న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై చిరంజీవి నటించిన సినిమాలోని దృశ్యాలని ప్రదర్శించారు.ఒక తెలుగు హీరోకి సంబంధించిన సినిమాల క్లిప్పింగ్స్ ని అక్కడి ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే  టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పుడు ఈ సంఘటన చిరుకి న్యూయార్క్ లో  ఉన్న ఫ్యాన్ బేస్ ని  తెలుపుతుంది. అలాగే చిరు సినిమాలు వస్తున్నంత సేపు మెగా స్టార్ జిందాబాద్ అనే అరుపులు మిన్నంటాయి.

ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్ కి చెందిన చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి తో పాటు  పద్మవిభూషణ్ అందుకున్న మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు గారికి కూడా తమ అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్, తానా, నాటా, లాంటి పలు సంఘాలు పాల్గొన్నాయి.

 

Exit mobile version