Home ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం నైజాం ఫస్ట్ డే కలెక్షన్..గత మూవీ రికార్డు చెల్లాచెదురు

గుంటూరు కారం నైజాం ఫస్ట్ డే కలెక్షన్..గత మూవీ రికార్డు చెల్లాచెదురు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu)ప్రస్తుతం తన నయా మూవీ గుంటూరు కారం(guntur kaaram)తో థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నాడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మహేష్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అయ్యింది. మొదటి ఆట నుంచి కాస్త నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యినప్పటకి కలెక్షన్ల విషయంలో మాత్రం మహేష్ తగ్గేదేలే అంటున్నాడు.

గుంటూరుకారం తొలిరోజు నైజాంలో రికార్డు కలెక్షన్ ని సాధించింది. పిఆర్ నంబర్స్ ప్రకారం మొదటి రోజే 16.9 కోట్ల షేర్ ని  రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించడానికి కూడా  సిద్దమవుతుంది దీంతో మహేష్ తన గత చిత్రం సర్కారు వారి పాట రికార్డు ని  బీట్ చేసినట్టయ్యింది.

ప్రస్తుతానికి అయితే టాక్ తో సంబంధం లేకుండా  రెండు తెలుగు రాష్ట్రాలు గుంటూరు కారం మానియాతో  ఉగిపోతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆల్ థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. మహేష్ ఫాన్స్ (mahesh fans)అయితే  గుంటూరుకారం టాక్ లో రోజు రోజుకి మార్పు వస్తుందని సినిమా హిట్ దిశగా పయనిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version