Home తెలంగాణ మెదక్ జిల్లాలో విషాదం, గంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి-medak news in telugu mother son...

మెదక్ జిల్లాలో విషాదం, గంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి-medak news in telugu mother son died in one day with heart attack ,తెలంగాణ న్యూస్

0

Medak News : ఒక్కగానొక్క కొడుకు గుండెపోటుతో చనిపోయాడని తెలిసిన మరుక్షణమే, అతని తల్లి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. తల్లి, కొడుకు గుండెపోటు తో మరణించిన విషాదకర సంఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘన్పూర్ మండలంలోని కూచన్ పల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో వీరప్పగారి నర్సా గౌడ్ (39), తన భార్య ఇద్దరు పిల్లలు తల్లి లక్ష్మి (60) తో కలిసి నివసిస్తున్నాడు. లక్ష్మికి నర్సా గౌడ్ తో పాటు మరొక కూతురు ఉండేది. కానీ ఆమె పాము కాటుతో కొంతకాలం క్రితం మరణించింది. తరువాత లక్ష్మి భర్త కూడా మరణించడంతో, నర్సా గౌడ్ ఒక్కడే ఆటో నడుపుతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్యలో ఆటో సరిగా నడువక, నర్సా గౌడ్ పై అప్పుల భారం పెరిగిందని గ్రామస్తులు చెప్పారు. ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదురుకుంటున్న నర్సా గౌడ్ శనివారం ఉదయం గుండెలో నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు.

Exit mobile version