- యువ నాయకుడు ఏబ్నైజర్ తల్లి వినయశీల పోటీ
- ఎస్సీ మహిళా రిజర్వు కావడంతో నిర్ణయం
- వార్డు అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న యువత
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల హడావిడి తాండూరు పట్టణం లో జోరందుకుంది. ఈసారి ఎలాగైనా వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలనే పట్టుదలతో యువ నాయకత్వం రంగంలోకి దిగుతోంది. తాండూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు నుండి యువ నాయకుడు జోగుల ఏబ్నైజర్ తన తల్లి జోగుల వినయశీలను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుత ఎన్నికల రిజర్వేషన్లలో భాగంగా 2వ వార్డు ఎస్సీ మహిళా కేటగిరీకి కేటాయించబడింది. దీంతో వార్డులోని యువత, అభ్యుదయవాదుల మద్దతుతో జోగుల ఏబ్నైజర్ తన తల్లి వినయశీల పేరును ప్రకటించారు. యువ నాయకత్వం వెనుక ఉండి నడిపిస్తుండటంతో వార్డులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు, మంచినీటి ఎద్దడి, వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తాము పోటీ చేస్తున్నట్లు ఏబ్నైజర్ తెలిపారు. మాతృమూర్తి అభ్యర్థిత్వం ద్వారా వార్డులోని మహిళల సమస్యలకు పెద్దపీట వేస్తామని, యువత ఆలోచనలకు అనుగుణంగా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వినయశీల అభ్యర్థిత్వానికి వార్డులోని పలువురు సీనియర్ నాయకులు, యువజన సంఘాల మద్దతు లభిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే క్షేత్రస్థాయిలో జోగుల కుటుంబం ప్రచారం ప్రారంభించడంతో 2వ వార్డులో ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది.






