
- బషీరాబాద్‌లో పేకాట స్థావరంపై దాడి..నలుగురి అరెస్టు
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల కేంద్రంలోని కళ్ళు కాంపౌండ్ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను బషీరాబాద్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నూమన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ గౌడ్ దుకాణం వెనుక పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.ఈ దాడిలో పాషా నాయక్ తాండాకు చెందిన చౌహాన్ శివరాం, బషీరాబాద్‌కు చెందిన షాభోద్దీన్, మహబూబ్, శ్రీనివాస్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,360 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



