Thursday, May 28, 2026

― Advertisement ―

ట్రాక్టర్ ఆపితే చంపేస్తా…!

పెద్దెముల్ మండలం ఖానాపూర్ గ్రామ వాగులో అక్రమ ఇసుక రవాణా జోరు రైతుల దారుల ధ్వంసం – అడ్డుకున్న రైతుపై బెదిరింపులు  పెద్ద పోలీస్ స్టేషన్లో రైతుల ఫిర్యాదు   జనవాహిని ప్రతినిధి పెద్దేముల్...
HomeNEWSసహారా అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ స్టార్ సందడి!

సహారా అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ స్టార్ సందడి!

spot_img
  • అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ స్టార్ ‘దర్శన కొలి’కి ఘనస్వాగతం
  • సహారా క్రికెట్ అకాడమీని సందర్శించిన తెలంగాణ తేజం
  • కరాటే, టెక్వాండోలలో 100కు పైగా పతకాలతో అరుదైన రికార్డు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ మట్టిలో పుట్టి, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్న క్రీడాకారిణి దర్శన కొలి నేడు నగరంలోని సహారా క్రికెట్ అకాడమీని సందర్శించారు. కరాటే మరియు టెక్వాండో క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఆమెకు అకాడమీ నిర్వాహకులు, యువ క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. దర్శన కొలి తన క్రీడా ప్రస్థానంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 100కు పైగా పతకాలను సాధించి రికార్డు సృష్టించారు.  బంగారు పతకాలు 25, రజత పతకాలు 20  , కాంస్య పతకాలు 15  ఇటీవలే ఆమె తెలంగాణ రాష్ట్రం తరపున నేషనల్ గేమ్స్‌కు ఎంపికై తన సత్తా చాటుతున్నారు.కేవలం దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిగిన ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొని దర్శన భారత్‌కు పేరు తెచ్చారు. దుబాయ్, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, కొరియా మరియు చైనా వంటి దేశాల్లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లలో తలపడి పతకాలు కైవసం చేసుకున్న ఏకైక తెలంగాణ అథ్లెట్‌గా నిలిచారు.సహారా క్రికెట్ అకాడమీని సందర్శించిన సందర్భంగా దర్శన కొలి మాట్లాడుతూ.. “పట్టుదల, నిరంతర సాధన ఉంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అసాధ్యం కాదు. తెలంగాణ ప్రభుత్వం మరియు అకాడమీల ప్రోత్సాహం క్రీడాకారులకు ఎంతో అవసరం,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, భవిష్యత్తులో ఆమె మరిన్ని గోల్డ్ మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.