Wednesday, June 24, 2026

― Advertisement ―

లంచం ఇస్తేనే పని చేస్తారు..!

యాలాల తహసీల్దార్ ఆఫీసులో 'లంచాల' పర్వం! డిప్యూటీ ఎంఆర్వో రూ.50 వేలు.. బంటు రూ.20 వేలు అడుగుతున్నారు ఆరు నెలలైనా కాని పట్టా రిజిస్ట్రేషన్.. కలెక్టర్‌కు మాజీ సర్పంచ్ ఫిర్యాదు జనవాహిని ప్రతినిధి...
HomeNEWSమార్పు కోరుతున్న 1వ వార్డు...!

మార్పు కోరుతున్న 1వ వార్డు…!

spot_img
  • తాండూరులో ‘జనసేన’ సునామీ.. 1వ వార్డులో ఎగిరేది గ్లాసు జెండానేనా?
  • ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అగ్గనూర్ అనిత ప్రచార జోరు!

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 1వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి అగ్గనూర్ అనిత (సిరి యాదవ్ కుటుంబ సభ్యులు) ప్రచారం ఒక ప్రభంజనంలా సాగుతోంది. గల్లీ గల్లీలో జనసేన గ్లాసు గుర్తు మారుమోగుతుండటంతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. అసలు పోటీ ఉందా లేదా అనే రేంజ్‌లో జనసేన కేడర్ దూసుకుపోతోంది.స్థానిక నాయకుడు సిరి యాదవ్‌కు ఉన్న ప్రజాబలం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఆయనకున్న పలుకుబడి, యువతలో ఉన్న క్రేజ్ అభ్యర్థికి కొండంత అండగా నిలుస్తోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. మా ఓటు మార్పు కోసం.. మా మద్దతు జనసేనకే” అంటూ ఓటర్లు బహిరంగంగానే మద్దతు తెలుపుతుండటం విశేషం. వార్డులోని యువత జనసేన జెండాలను భుజానికెత్తుకుని ప్రచార క్షేత్రాన్ని హోరెత్తిస్తున్నారు. పెద్దల ఆశీర్వాదం, యువత ఉత్సాహం చూస్తుంటే 1వ వార్డులో జనసేన భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.1వ వార్డు అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుడి గొంతు వినిపించాలన్నా అది జనసేనతోనే సాధ్యంమని,భారీ విజయం దిశగా అడుగులు వేస్తున్నామని సిరి యాదవ్ వెల్లడించారు.