- వెంకటమ్మ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు దివిటి ఎల్లప్ప ఆర్థిక సాయం
జనవాహిని ప్రతినిధి తాండూరు : పాత తాండూరు 15వ వార్డుకు చెందిన మెంగార్గాని వెంకటమ్మ మృతి పట్ల కాంగ్రెస్ యువ నాయకుడు దివిటి ఎల్లప్ప తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ, గురువారం తుదిశ్వాస విడిచారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆమె మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న దివిటి ఎల్లప్ప వెంటనే మృతురాలి నివాసానికి చేరుకుని, ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. తన వంతు సహాయంగా రూ. 3000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జె. నరేష్, శివ కుమార్, మెంగరిగాని శ్రీనివాస్, గజ్జలప్ప మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.






