
- జనవాహిని ఎఫెక్ట్
- కదిలిన యంత్రాంగం..
- తాండూరులో మురుగు కాలువల శుద్ధి
- అధికారుల తక్షణ స్పందన..
- ‘జనవాహిని’ కథనానికి ఫలితం
జనవాహిని ప్రతినిధి, తాండూరు: పట్టణ నడిబొడ్డున ఉన్న ఇందిరా చౌరస్తా, పోలీస్ స్టేషన్ మరియు విద్యుత్ కార్యాలయం ముందు పేరుకుపోయిన మురుగు సమస్యపై ‘జనవాహిని’ ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు.తాండూరు నడిబొడ్డున మురుగు కంపు అనే శీర్షికతో ప్రధాన రహదారి పక్కనే డ్రైనేజీ లో చెత్త చెదారం… నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను జనవాహిని ఎత్తిచూపింది. ఈ వార్త సోషల్ మీడియాలో మరియు పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మున్సిపల్ పారిశుధ్య విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు.మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బంది మంగళవారం ఉదయాన్నే ఇందిరా చౌరస్తా ప్రాంతానికి చేరుకున్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే స్పందించిన అధికారులను సైతం వారు అభినందించారు. ఇకపై క్రమం తప్పకుండా పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.



