- అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం
- రాజు గౌడ్ ఆరోపణలు అర్థరహితం
- ఎమ్మెల్యేపై బురదజల్లితే సహించేది లేదు
- రాజు గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ చేస్తున్న ఆరోపణలను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ… తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని సంతోష్ మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి కూడా, వాటిని అర్హులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా లక్కీ డ్రా పద్ధతిలో పేదలకు ఇళ్లను కేటాయిస్తుంటే, రాజకీయ ఉనికి కోసమే రాజు గౌడ్ బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు.ఇళ్ల పంపిణీలో అవినీతి జరిగిందని, ఒక్కో ఇంటిని అమ్ముకున్నారని మాట్లాడటం రాజు గౌడ్ అవివేకానికి నిదర్శనం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలి తప్ప, ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు” అని సంతోష్ హితవు పలికారు. ప్రైవేట్ ట్రస్ట్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, పేదలకు ఇళ్లు దక్కకూడదనే కుట్రతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.తాండూరులో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలుగుతున్నారని, ఇళ్ల పంపిణీని సాకుగా చూపి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని కావలి సంతోష్ స్పష్టం చేశారు.




