
- దాదాపు 300లకు పైగా బోగస్ ఓట్లు నమోదు
- 6వ వార్డ్ ఓటర్ జాబితా ను సవరించాలి
- అధికారులకు పిర్యాదు చేసిన బోయ అనిల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడిందని యువనాయకుడు బోయ అనియ అభ్యంతరం వ్యక్తం చేశారు. 6వ వార్డ్ హమాలీ బస్తీలో ఇతర వార్డ్ కు చెందిన ఓట్లు నమోదు అయ్యాయని, వార్డ్ లో ఓట్లు కూడా అధికంగా పెరిగినట్టు తెలిపారు. సుమారు 400 లకు పైగా దొంగ ఓట్లు 6వ వార్డ్ లో నమోదైనట్లు గా పేర్కొన్నారు. ఈ సందర్బంగా సోమవారం మున్సిపల్ అధికారులకు ఓటర్ల జాబితాపై పిర్యాదు చేశారు. అధికారులు వెంటనే స్పందించి బోగస్ ఓట్లను తొలగించాలని కోరారు. ఏ వార్డుకు చెందిన ఓటర్లు అదే వార్డులో ఉండేలా పారదర్శకత పాటించాలని, తుది జాబితా ప్రకటన నాటికి ఈ సమస్యలను అన్నింటిని పరిష్కరించాలని కోరారు. తప్పులతో కూడిన ఓటర్ జాబితా వల్ల అభ్యర్థులకు, ఓటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి 6వ వార్డ్ ఓటర్ జాబితాను తక్షణమే సవరించాలని అధికారులను డిమాండ్ చేశారు.



