
- కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నా దంపతులు
- వార్డ్ ల అభివృద్ధి పై కృషి చేస్తాం
- జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 14,15 వ వార్డ్ లలో అభ్యర్థులు గా పోటీ చేసేందుకు దంపతులు ముందుకు వస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డ్ నుండి మ్యాతరి సురేష్, ఇందు లు కౌన్సిలర్ అభ్యర్థులు లు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవకాశం ఇస్తే తప్పకుండ బరిలో ఉంటామని, వార్డుల అభివృద్ధి కి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఉంటూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి లో తమ వార్డ్ లు కూడా అభివృద్ధి చెందేల పని చేస్తామని వెల్లడించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండ 14,15వ వార్డ్ ల నుండి అభ్యర్థులు గా బరిలో ఉంటాం అని ఈ సందర్బంగా దంపతులు స్పష్టం చేశారు.



