- శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్ ఎల్లప్ప..!
- తన విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇటీవల జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఎన్నికైన ఎల్లప్ప, శనివారం ఆర్బిఓఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తన విజయానికి సహకరించినందుకు గాను ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఎల్లప్ప, ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకుల, కార్యకర్తల సమిష్టి కృషితోనే తాను విజయం సాధించానని, శ్రీనివాస్ రెడ్డి అందించిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు. వార్డ్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంటిపల్లి వెంకట్, నరేష్, జంటిపల్లి సుధాకర్, శివ కుమార్, రవి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.



