
- పట్టణం లో భారీ ఆఫర్
- బట్టల కోసం ఎగబడిన మహిళలు
- గాంధీ చౌక్ లో ట్రాఫిక్ జామ్…
- నిబంధనలు మరిచిన షాపింగ్ మాల్ యాజమాన్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలోని ప్రధాన కూడలి గాంధీ చౌక్ లో శుక్రవారం దూలహన్ ఖజానా మినీ షాపింగ్ మాల్ ప్రారంభించారు. నూతన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్బంగా దుకాణ యాజమాన్యం ఆఫర్ ప్రకటించారు. కేవలం రూ. 51 లకే డ్రెస్ ఆఫర్ ఉండడం తో శనివారం కూడా మహిళలు భారీ సంఖ్యలో దుకాణం దగ్గర గుమ్మిగుడారు. శనివారం ఉదయం నుండి షాపింగ్ మాల్ ముందు మహిళలు ఆఫర్ కోసం బారులు తిరడం తో భారీ ట్రాఫిక్ నెలకొంది. ఈ సందర్భంగా దూలహన్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఆఫర్ పెట్టడం తో…. ఈ భారీ అఫర్ ను దక్కించుకుందెకు మైనార్టీ మహిళకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్నారులతో బారులు తీరారు.దీంతో దూలహన్ ఖజానా బట్టల దుకాణం ముందు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో హవానదారులకు , పాదచారులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫర్ లు పెట్టారు కానీ నిబంధనలు మరిచారు. ఎలాంటి అనుమతులు, సమాచారం స్థానిక పోలీసులకు ఇవ్వకుండా ఆఫర్ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యడం సారి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



