మనోహర్ రెడ్డి చాప్టర్ క్లోజ్…!

- పంచాయితీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాట్ కామెంట్స్ధి
- అధికార పార్టీ కి చెంపదెబ్బ
- దౌర్జన్యాల రాజకీయం మునుపెన్నడూ చూడలేదు”
- ప్రభంజనం కాదు, దౌర్జన్యం”: అధికార పక్షంపై పైలెట్ రోహిత్ రెడ్డి.
- జిల్లా ZP ఛైర్మన్ సీటు మాదే: రోహిత్ రెడ్డి ధీమా.
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దౌర్జన్యపూరిత రాజకీయం, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మునుపు ఎన్నడూ చూడని విధంగా దౌర్జన్యాల రాజకీయం ఈ ఎన్నికల్లో కనిపించిందన్నారు. హడావిడి చేసి, బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు, అని రోహిత్ రెడ్డి ఆరోపించారు.అధికార పార్టీ బెదిరింపులను తట్టుకొని నిలబడిన బీఆర్ఎస్ నికార్సైన కార్యకర్తల ధైర్యానికి ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు.వంద సీట్లు సాధించామని చెప్పుకోడానికి సిగ్గుండాలి. ఈ ఫలితాలు రూలింగ్ పార్టీకి చెంప పెట్టు. ప్రభంజనం ఏమీ లేదు, కేవలం దౌర్జన్యమే,” అని రోహిత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశిస్తూ రోహిత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. మనోహర్ రెడ్డి, నీకు తాండూరులో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలుసా? ఈ ఎన్నికతో నీ చాప్టర్ క్లోజ్, నువ్వు తిరుమలపూర్ వెళ్లాల్సిన టైం వచ్చిందిని ఘాటుగా హెచ్చరించారు. కుప్పన్ కోట్‌లో తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ, వారికి ఏమైనా అయితే మనోహర్ రెడ్డి బాధ్యత తీసుకుంటావా?” అని ప్రశ్నించారు. అదేవిదంగా రానున్న జడ్పీటీసీ ఎన్నికలపై రోహిత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో నాలుగు జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటాం. జిల్లా జడ్పీ ఛైర్మన్ సీటు పై కుసుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.తాండూరు నియోజకవర్గ ప్రజలు నీకు ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చారు, ఏదో ఒకటి మంచి పని చేసి పో,” అని మనోహర్ రెడ్డికి ఈ సందర్బంగా సూచన చేశారు.



