
- చికిత్స పొందుతూ గిరిజాపూర్ యువకుడు సురేష్ మృతి
- చెన్నారం గేటు సమీపంలో ఘటన
జనవాహిని ప్రతినిధి తాండూరు : అజాగ్రత్తగా నడిపిన ఓ ఆటో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన తాండూరు ప్రాంతంలో విషాదాన్ని నింపింది.యాలల్ ఎస్ఐ విట్టల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం గిరిజాపూర్ గ్రామానికి చెందిన సురేష్ (30), తండ్రి గంగప్ప, శనివారం తన ద్విచక్ర వాహనం పై తాండూరు పట్టణానికి బయలుదేరారు. చెన్నారం గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా సురేష్ బైకును ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సురేష్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్ఐ వెల్లడించారు.



