పోలింగ్ టెన్షన్… టెన్షన్..!

- సీనియర్ నాయకులకు సవాల్
- యువకుల ఎదురుదెబ్బ తప్పదా…
- అర్దరాత్రి వరకు కొనసాగిన నాయకుల మంతానలు
- నేడు సాయంత్రం ఫలితలపై ఫోకస్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ హడావిడి కొనసాగుతుంది. పలు గ్రామాల్లో యువకులు ఎంత ఉత్సాహంగా తమ ఓటు వినియోగించుకోవడానికి బయలుదేరుతున్నారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు బడా నాయకులకు తలనొప్పిగా మారాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం పలు గ్రామా పంచాయతీల్లో నాయకులు మంతనాలను కొనసాగించారు. తమ అనుభవాన్ని ఉపయోగిస్తూ రాజకీయ హస్త్రాలను ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ బడా నాయకులకు పలు గ్రామపంచాయతీలో ఎదురుదెబ్బ పడక తప్పదనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా సర్పంచ్ బరిలో దిగారు. యువకులకు గ్రామంలో భారీ మద్దతు లభించడంతో, బడా నాయకులకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. మార్పు కోసం యువత, ఊరు కోసం మనం అంటూ, యువకులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. నాయకులు తమ స్వగ్రామంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పంచాయతీ ఫలితాలు నేడు సాయంత్రమే వెలువడే అవకాశం ఉండడంతో నాయకుల్లో మరింత హై టెన్షన్ మొదలైంది. తన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో కొందరు తమ కేడర్ను కూడా పోగొట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం బుధవారం అర్ధరాత్రి వరకు కూడా పలు మండలాల నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు సైతం పలు గ్రామాల్లో తిష్ట వేసి తమ అభ్యర్థుల కోసం రాజకీయ హస్త్రం ఉపయోగించారు. నేడు జరగబోయే ఈ పోలింగ్ ఎవరికి మద్దతుగా నిలుస్తుందని ఉత్కంఠ నియోజకవర్గ వ్యాప్తంగా, నాయకులకు, ప్రజలకు మొదలైంది. ఈరోజు సాయంత్రం వెలువడే ఫలితాల్లో గ్రామపంచాయతీలో యువకుల పాత్ర, సీనియర్ నాయకుల పాత్ర ఎంతో వేచి చూడాల్సిందే..



