కారెక్కిన కాంగ్రెస్ నాయకుడు..!

- బీఆర్ఎస్లోకి తిరిగివచ్చిన సంతోష్ గౌడ్
- సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందన్న నేత
- సాధారణంగా ఆహ్వానించిన రోహిత్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ పార్టీ ని విడిన యువనాయకుడు సంతోష్ గౌడ్. తాండూరు పట్టణానికి చెందిన సంతోష్ గౌడ్ సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఆయన బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం సంతోష్ గౌడ్ మాట్లాడుతూ… పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన వెంటే ఉండి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సంతోష్ గౌడ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ శ్రేణుల ఐక్యతే లక్ష్యంగా పని చేస్తానని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంతోష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






