
- 5వ వార్డు కౌన్సిలర్‌గా పోటీకి సిద్ధం..
- అటు పార్టీ లేదా ఇటు స్వతంత్ర పోటికైనా రెడీ…!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ రాజకీయాల్లో యువకుల ఉత్సహం మరింత పెరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 5వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా హురేర్ ఖాన్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. వార్డు అభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్న ఆయన, ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ సందర్భంగా హురేర్ ఖాన్ మాట్లాడుతూ, వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం గుర్తిస్తే పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ అవకాశం లభించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా నైనా ఖచ్చితంగా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.వార్డులోని ప్రతి గల్లీలో ఉన్న సమస్యలను తాను నిశితంగా గమనిస్తున్నానని, ప్రజల ఆశీస్సులతో గెలిచి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



