AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాల రిలీజ్-ఇలా చెక్ చేసుకోండి..! | AP EAPCET 2026 Results out today: here is how to check, download score cards

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)


Education Jobs

oi-Syed Ahmed

ఏపీలో దాదాపు 3 లక్షల మందికి పైగా విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ (AP EAPCET 2026 Results) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాల్ని ఎక్స్ లో విడుదల చేశారు. అలాగే అభ్యర్ధులు ఫలితాల్ని ఎలా తెలుసుకోవచ్చో కూడా వివరాలు వెల్లడించారు. వాస్తవానికి ఈ ఫలితాలు నిన్న విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.

ఈసారి రాష్ట్రంలో మొత్తం 3.29 లక్షల మంది వివిధ విభాగాల్లో ఎంసెట్ పరీక్షలు రాశారు. మే 12 నుంచి 30వ తేదీ వరకూ ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను జూన్ 1నే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, సీబీఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాల కోసం వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఇవాళ ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అయితే సీబీఎస్ఈ రీవెరిఫికేషన్ ఫలితాలు దశల వారీగా విడుదల చేస్తుండటం, ఇంకా కొందరు అభ్యర్ధుల ఫలితాలు రాకపోవడంతో ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. వాటిని ఇవాళ విడుదల చేశారు.

AP EAPCET 2026 Results out today here is how to check download score cards

ఈ ఫలితాలను అభ్యర్ధులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల పేరుతో లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వాటిని ప్రింట్ తీసుకునేందుకు కూడా అక్కడే ఆప్షన్ ఇస్తారు. ఇలా స్కోర్ కార్డుల్ని ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *