మైల్వార్ లో ఇద్దరు బాహుబలుల కోల్డ్ వార్

- కాంగ్రెస్ అభ్యర్థి ని నేనే అంటూ ప్రచారం
- ఎవ్వరిని పార్టీ అభ్యర్థి అనుకోవాలో తెలియని డైనమాలో గ్రామస్తులు
- ఎమ్మెల్యే మద్దతు ఎటు వైవు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఆ మైల్వార్ గ్రామానికి ఏమైందో ఏమో! అంతా టికెట్ టెన్షన్లో తలమునకలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఒక్కరైతే సరిపోతుంది కదా? కానీ ఇక్కడ సీన్ రివర్స్!
ఇద్దరు మహాశయులు ‘నేనే కాంగ్రెస్! నేనే కాంగ్రెస్!’ అంటూ భుజాలు చరుచుకుంటున్నారు. ఎవరిని చూసి నమ్మేదో గ్రామ ప్రజలకు అర్థం కావట్లేదు.ఇద్దరికీ ఇద్దరు ‘జై కాంగ్రెస్’ అంటూ గ్రామం లో ప్రచారం చేస్తున్నారు. ‘మీ ఇద్దరిలో అసలు కాంగ్రెస్ ఎవరు స్వామీ?’ అని అడిగితే సమాధానం లేదు. ఒక మనిషి రెండు చోట్ల ఉండలేడు కదా! బహుశా ఆ టికెట్‌కి ‘మైక్రోస్కోపిక్’ డిమాండ్ ఉండి ఉంటుంది!వామ్మో! అధికార పార్టీ మైల్వార్ గ్రామాన్ని అస్సలు పట్టించుకోలేదట. ‘మాకు మేమే ప్రచారం చేసుకుంటాం, అంతా మాదే అన్నట్టుగా ఈ ఇద్దరు కాంగ్రెస్ వీరులు హడావుడి చేస్తున్నారు. మైల్వార్ ప్రజల పరిస్థితి అయితే మహా దారుణంగా మారింది. అసలు కాంగ్రెస్ తరఫున నిలబడేది ఎవరయ్యా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఒకాయన పార్టీ ఆఫీస్‌లో ఉంటే, మరో బాహుబలి ‘సర్పంచ్ టికెట్ నాదే!’ అంటూ రంకెలు వేస్తున్నాడట! ‘ఓటు ఎవరికి వేయాలి? ఒకవేళ ఓటు వేస్తే, గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కోర్టుకెళ్లి కొట్టుకుంటే మా గతి ఏంటి?’ అని ప్రజలు గందరగోళం పడ్డారు.
అసలు మజా! ఎమ్మెల్యే మద్దతు ఎవరికి?
ఇదంతా చూస్తుంటే అసలు ట్విస్ట్ ఏంటంటే… ఎమ్మెల్యే మద్దతు ఎవరికి ఉందనేది! ఎమ్మెల్యే ఎవరికి మద్దతు ఇచ్చినా, రెండో వ్యక్తి ‘నన్ను చూడండి, నేనే అసలైన అభ్యర్థిని!’ అని నిలబడేలా ఉన్నాడు. మైల్వార్ టికెట్ టెన్షన్ చూస్తుంటే, ఆ టికెట్ ఒక బంగారం బిస్కెట్ కంటే ఎక్కువ అయిపోయింది మారిపోయింది!మైల్వార్ లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక అభ్యర్థి ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇద్దరు ప్రచారకర్తలు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు అనేది ప్రస్తుత ప్రచారం. ఆ గ్రామా పరిస్థితి ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపి పరిస్కారం చేస్తారా లేదా.. అనేదే గ్రామం లో హాట్ టాపిక్ గా మారింది.



