
- రోహిత్ రెడ్డి ఆశీర్వాదం కావాలి
- బిఆర్ఎస్ నాయకులు నర్సింహా
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎన్నికల సమయం సమిపిస్తున్న నేపథ్యంలో తాండూరు మున్సిపల్ బరిలో ఉండేందుకు యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డ్ లో అభ్యర్థి గా పోటీ చేస్తానని నర్సింహా వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆశీర్వాదం ఇస్తే తప్పకుండ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉంటానున్నారు. రిజర్వేషన్ మహిళకు కేటాయించిన ప్రవీణ ను బరిలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ ప్రజల కోరిక మేరకు, బిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. గత కొన్నేళ్లు గా బిఆర్ఎస్ పార్టీ లో ఉన్నాం అని, రోహిత్ రెడ్డి కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్బంగా 14వ వార్డ్ నుండి ఎన్నికల బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం అని స్పష్టం చేశారు.



