తాండూరు ప్రగతిపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్..!

JANAVAHINI
1 Min Read
  • 90 రోజుల్లో తాండూరు మండల ముఖచిత్రం మారాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్క్షే
  • త్రస్థాయిలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ
  •   వారంలో ప్రభుత్వ ఆసుపత్రి పనులకు నిధుల మంజూరు
  •  ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి సాధ్యం

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు రూపొందించిన ’90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తీవరీ అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూరు మండలంలో పర్యటించిన ఆయన, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..గ్రామ పంచాయతీల సందర్శనలో భాగంగా పలు సమస్యలను గుర్తించామని, 90 రోజుల ప్రణాళికలో భాగంగా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.తాండూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న డ్రైనేజీ మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఇప్పటికే అంచనాలు రూపొందించాంమన్నారు. వారం రోజుల్లో నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కావని, ఇందులో ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అన్ని శాఖల సమన్వయంతో తాండూరు ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *