Tuesday, January 21, 2025

అధికారం వుండగానే అన్నీ మాయం చేద్దాం! | disappear evidence while in power| jagan| sarkar| hopeless| retaining

posted on Apr 13, 2024 4:13PM

ట్యాపింగ్ మా జన్మహక్కు అన్నట్టుగా అధికారంలో వున్న రాజకీయ నాయకులు తయారయ్యారు. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రకరకాల యాంగిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు భారీ స్థాయిలో ఆధారాలు దొరికిపోయాయి. ట్యాపింగ్ చేయడంలో పాత్రధారులుగా పనిచేసిన పోలీసు అధికారులు దొరికిపోయి జైల్లో  రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోరన్న ధీమాలో వున్న ట్యాపింగ్ పోలీసు అధికారి, ప్రభుత్వం కూలిపోయిన మర్నాడు వెళ్ళి ట్యాపింగ్‌కి సంబంధించిన అంశాలను ధ్వంసం చేశాడు. ఈ పాయింటే ట్యాపింగ్ తీగ లాగి డొంకంతా కదిలించడానికి ఆధారం అయింది. ఎంచక్కా అధికారంలో వున్నప్పుడే ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసేసినట్టయితే ఎవరికీ అనుమానం వచ్చేది కాదు.  ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక వేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంచక్కా మళ్ళీ ట్యాపింగ్ గేమ్ ఆడుకోవడానికి వీలయ్యేది. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న అతి నమ్మకమే ట్యాపింగ్ వీరుల కొంప ముంచింది. పోలీసులు పాత్రధారులు జైల్లో పడేలా చేసింది. అసలు సూత్రధారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేస్తోంది.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి ప్రత్యక్ష గురువు కాకపోయినా దాదాపు గురువులాంటి కేసీఆర్ ట్యాపింగ్ బాటలో నడిచినప్పుడు ఆయన శిష్యుడు కాని శిష్యుడు జగన్ మాత్రం ఆ బాటలో నడవకుంటా వుంటారా? ఎందుకు నడవరు? కచ్చితంగా నడవటం మాత్రమే కాదు.. వీలైతే పరిగెత్తుతారు కూడా. ఈ విషయంలో ఏపీ తెలుగుదేశం నాయకులకు మొదటి నుంచీ అనుమానాలు వున్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి మొర్రో అని మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఏపీలో పోలీసు పెద్దలందరూ అధికార పార్టీకి చెమ్చాలు, గరిటెలుగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఆక్రోశాన్ని ఎవరు పట్టించుకుంటారు. లేటెస్ట్ గా నారా లోకేష్ ఐ ఫోన్‌ని కూడా ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆధారాలు దొరికిపోయాయి. అందువల్ల ఏరకంగా చూసినా జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు అర్థమవుతోంది.

ఏపీలో ఈసారి జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల తెలంగాణలో మాదిరిగా తమ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇరుక్కుపోకుండా వుండాలంటే  ఇప్పటి వరకు చేసిన ట్యాపింగ్‌తో సరిపెట్టుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత తమ పార్టీకి తట్టాబుట్టా సర్దుకోవడం తప్పదు కాబట్టి  ఇప్పుడు అధికారంలో వున్నప్పుడే ట్యాపింగ్‌కి సంబంధించిన ఆధారాలన్నీ యాసిడ్ పోసి కడిగేసినట్టు కడిగేస్తే బెటరని అనుకుంట్టు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana