posted on Apr 13, 2024 4:13PM
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి ప్రత్యక్ష గురువు కాకపోయినా దాదాపు గురువులాంటి కేసీఆర్ ట్యాపింగ్ బాటలో నడిచినప్పుడు ఆయన శిష్యుడు కాని శిష్యుడు జగన్ మాత్రం ఆ బాటలో నడవకుంటా వుంటారా? ఎందుకు నడవరు? కచ్చితంగా నడవటం మాత్రమే కాదు.. వీలైతే పరిగెత్తుతారు కూడా. ఈ విషయంలో ఏపీ తెలుగుదేశం నాయకులకు మొదటి నుంచీ అనుమానాలు వున్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి మొర్రో అని మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఏపీలో పోలీసు పెద్దలందరూ అధికార పార్టీకి చెమ్చాలు, గరిటెలుగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఆక్రోశాన్ని ఎవరు పట్టించుకుంటారు. లేటెస్ట్ గా నారా లోకేష్ ఐ ఫోన్‌ని కూడా ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆధారాలు దొరికిపోయాయి. అందువల్ల ఏరకంగా చూసినా జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు అర్థమవుతోంది.
ఏపీలో ఈసారి జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల తెలంగాణలో మాదిరిగా తమ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇరుక్కుపోకుండా వుండాలంటే ఇప్పటి వరకు చేసిన ట్యాపింగ్‌తో సరిపెట్టుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత తమ పార్టీకి తట్టాబుట్టా సర్దుకోవడం తప్పదు కాబట్టి ఇప్పుడు అధికారంలో వున్నప్పుడే ట్యాపింగ్‌కి సంబంధించిన ఆధారాలన్నీ యాసిడ్ పోసి కడిగేసినట్టు కడిగేస్తే బెటరని అనుకుంట్టు తెలుస్తోంది.