Friday, January 10, 2025

కూటమి అభ్యర్థుల విజయం కోసం ద్వారకా తిరుమలలో పురంధేశ్వరి ప్రత్యేక పూజలు | purandeswari perfors special pooja in dwaraka| tirumala| alliance| win| campaign| kick

posted on Apr 5, 2024 5:32PM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన ఎన్నికల ప్రచారాన్ని ద్వారకా తిరుమల శుక్రవారం (ఏప్రిల్ 5)  ప్రారంభించారు. అంతకు ముందు ఆమె ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వెంకన్నదేవునికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆమె తెలిపారు.

రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పురంధేశ్వరి తన ప్రచారానికి ద్వారకా తిరుమల నుంచే శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ అభ్యర్థులనే కాకుండా రాష్ట్రంలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.

  కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో మార్పును ప్రజలందరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు అలాగే దేవస్థానం సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగించకుండా కేవలం భక్తుల సౌకర్యార్థం వారిని ఆలయాలకే పరిమితం చేయాలని ఎన్నికల కమిషన్ ని ఈ సందర్భంగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆలయమర్యాదలతో స్వాగతంపలికారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana