posted on Apr 5, 2024 5:32PM
రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న పురంధేశ్వరి తన ప్రచారానికి ద్వారకా తిరుమల నుంచే శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ అభ్యర్థులనే కాకుండా రాష్ట్రంలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు.
కూటమి అభ్యర్థులకు విజయం చేకూర్చడం ద్వారా రాష్ట్రంలో మార్పును ప్రజలందరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు అలాగే దేవస్థానం సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగించకుండా కేవలం భక్తుల సౌకర్యార్థం వారిని ఆలయాలకే పరిమితం చేయాలని ఎన్నికల కమిషన్ ని ఈ సందర్భంగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆలయమర్యాదలతో స్వాగతంపలికారు.