Sunday, January 12, 2025

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు !

posted on Mar 21, 2024 12:58PM

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమికి లోక్‌సత్తా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ  ప్రకటించారు. ఎపి రాజకీయాల్లో ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇక నుంచి  పూర్తిగా తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ అని ఈ ప్రకటనతో తేలిపోయింది. మీడియాతో మాట్లాడుతూ  తన పార్టీ ఎన్ డి ఏకు మద్దత్తునిస్తుందన్నారు. ఆయన ఈ విషయాన్ని  స్వయంగా వెల్లడించడంతో ఎపిలో టిడిపి కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఏపీలో అరాచక పాలన సాగుతోందని జయప్రకాశ్ నారాయణ్ ఆరోపిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని  ఆయన కోరారు. భయం లేకుండా అందరూ పోలింగ్‌లో పాల్గొని.. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పాలన సాగించేవారిని ఎన్నికోవాలని సూచించారు.అయితే జయప్రకాశ్ నారాయణ్ ప్రకటనపై వైసీపీ ఇంత వరకు తన వైఖరి ప్రకటించకపోవడం గమనార్హం. 

ఏపీలో రాజకీయ పరిస్థితులుఅంతకంతకూ దిగజారుతున్నాయి.   మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. దానితో పాటు అభివృద్ధి కూడా కావాలి అనేది వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చుపెట్టడం మంచిదికాదని జయప్రకాశ్ నారాయణ్ వాదిస్తున్నారు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం, అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం” అని ఆయన అభిప్రాయపడుతున్నారు

ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన  జయప్రకాష్ నారాయణ  ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.  అరాచకపాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి , సంక్షేమానికి పాటు పడేవారికి మద్దతిస్తున్నానని  ఆయన ఖరా ఖండిగా తెలిపారు.  ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర  వేసి తిట్టే వాళ్లు ఉన్నారని జయప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.  అయినా నిజాయితీ రాష్ట్ర భవిష్యత్ కోసమే మద్దతు  ప్రకటిస్తున్నానని జయప్రకాశ్ నారాయణ్   ఘంటాపథంగా తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana