posted on Mar 21, 2024 12:58PM
ఏపీలో రాజకీయ పరిస్థితులుఅంతకంతకూ దిగజారుతున్నాయి. మంచి పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు. దానితో పాటు అభివృద్ధి కూడా కావాలి అనేది వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అప్పులు తీసుకువచ్చి సంక్షేమం కోసం ఖర్చుపెట్టడం మంచిదికాదని జయప్రకాశ్ నారాయణ్ వాదిస్తున్నారు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనం, అభివృద్ధి అంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం” అని ఆయన అభిప్రాయపడుతున్నారు
ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన జయప్రకాష్ నారాయణ ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అరాచకపాలనకు చరమగీతం పాడి.. అభివృద్ధి , సంక్షేమానికి పాటు పడేవారికి మద్దతిస్తున్నానని ఆయన ఖరా ఖండిగా తెలిపారు. ఇలా మద్దతు ప్రకటించినందుకు తనపైనా కులం ముద్ర వేసి తిట్టే వాళ్లు ఉన్నారని జయప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నిజాయితీ రాష్ట్ర భవిష్యత్ కోసమే మద్దతు ప్రకటిస్తున్నానని జయప్రకాశ్ నారాయణ్ ఘంటాపథంగా తెలిపారు.