రనౌట్‌తో గిల్ సెంచరీ మిస్
196 పరుగులకు 2 వికెట్ల వద్ద నాలుగో రోజు ఆటకు భారత్ బరిలోకి దిగింది. శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ కొనసాగించారు. అయితే, శుభ్‌మన్ గిల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో రనౌట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేస్తూ దూకుడు చూపిన గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కుల్దీప్ పరుగుకు పిలిచి వెనక్కి పంపడంతో గిల్‌ను దురదృష్టం వెంటాడింది. దీంతో 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటై చాలా నిరాశగా పెవిలియన్‌కు చేరాడు గిల్. ఆ తర్వాత కాసేపటికే కుల్దీప్ కూడా ఔటయ్యాడు.