- ఎన్నికల బరిలో తులసి రాము
- స్థానికుడికే పట్టం కడతామంటున్న తెలుగు గడ్డ ఓటర్లు
- బీసీ సంఘం నాయకుడు రాజ్ కుమార్ పూర్తి మద్దతు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల సమిపిస్తున్న సందర్బంగా 36వ వార్డ్ నుండి తులసి రాము బరిలో ఉండనున్నారు. తులసి రాము ముదిరాజ్ స్థానికుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా రాముకు వార్డు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది.వార్డులో ఉన్న మొత్తం 1,760 ఓట్లలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 380 వరకు ఉన్నాయని,దీనికి తోడు మైనారిటీలు, వైశ్యులు, రజక, మోచి, వీరశైవ సమాజాల ఓట్లు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయన్నారు. రాము ముదిరాజ్ మొదటి నుండి ఈ వర్గాలన్నింటితో సత్సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు ప్రధాన బలంగా మారింది. బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ అండదండలు కూడా తోడవడంతో రాము గెలుపుపై ధీమాగా ఉన్నారు.గతంలో ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు ఉండటంతో, ఈసారి మన వార్డు – మన వ్యక్తి అనే నినాదం బలంగా వినిపిస్తోంది. తులసి రాము ముదిరాజ్ ఇదే వార్డులో పుట్టి పెరగడం, గతంలో ముదిరాజ్ సంఘం యువజన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం ఓటర్లను ఆకర్షిస్తోంది.ఈ సందర్బంగా…రాము ముదిరాజ్ మాట్లాడుతూ.. వార్డు సమస్యలు తనకు పూర్తిగా తెలుసన్నారు. ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, ఈ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తా అని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, బీసీ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనను వార్డు ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






