
- తాండూరు 33వ వార్డు బరిలో యువనేత ‘ఆశిష్’
- అవకాశమిస్తే బరిలో ఉంటా..
- వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటా: అష్టికర్ ఆశిష్
జనవాహిని ప్రతినిధి తాండూరు : అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా అంటూ ఓ యువ నాయకుడు తన వార్డ్ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న 33వ వార్డు నుండి పోటీ చేసేందుకు యువనేత అష్టికర్ ఆశిష్ ఆసక్తి చూపుతున్నారు. గతంలో హేమహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ వార్డులో, ఈసారి యువ రక్తం ఉరకలేయాలని ఆయన భావిస్తున్నారు.ఆ వార్డ్ లో ఆయనకు మంచి పట్టుందని, మిత్రబృందం, మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ.. “33వ వార్డు తన మాతృభూమి అని ఇక్కడి ప్రజల సమస్యలు ఆశిష్ కు తెలుసన్నారు పెద్దలు, యువకులు ఆశీష్ కు అవకాశం ఇస్తే తప్పకుండ బరిలో ఉంటానని, గెలిచిన తర్వాత వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, అభివృద్ధి బాటలో నడిపిస్తాను” అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే బరిలో ఉంటానని, ప్రతి సమస్యపై స్పందిస్తానని అయన పేర్కొన్నారు.



