Home ఆంధ్రప్రదేశ్ AP Sub Registrar Offices : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రాచరిక విధానానికి స్వస్తి, సామాన్యుడి...

AP Sub Registrar Offices : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రాచరిక విధానానికి స్వస్తి, సామాన్యుడి గౌరవం పెంచేలా కీలక నిర్ణయం

0

ఇతర ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉండాలని, సీటింగ్ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులే అనే భావన ప్రజలకు కలిగించేలా రెవెన్యూ శాఖ మార్పులు చేపట్టింది. సబ్ రిజిస్ట్రార్‌ కూర్చొనే ఎత్తైన పోడియం, చుట్టూ ఉన్న రెడ్ క్లాత్ ను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కుర్చీ కూడా ఫ్లోర్ హైట్‌లో ఉండాలని, వారి చుట్టూ ఎలాంటి అడ్డు ఉండకూడదని శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని అందించే ప్రజలకు… రిజిస్ట్రేషన్ ఆఫీసులో అత్యధిక గౌరవం ఉండాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రజలు నిలబడి ఉండే విధానానికి స్వస్తి పలకాలని అధికారులు ఆదేశించారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సమయం పడితే వారికి మంచినీళ్లు, టీ ఇచ్చి గౌరవించాలని సర్క్యులర్ జారీ చేశారు.

Exit mobile version