Home తెలంగాణ కంపు కొడుతున్న పల్లెలు.. పట్టించుకోని అధికారులు.. మంచానపడుతున్న ప్రజలు-viral fever is coming in adilabad...

కంపు కొడుతున్న పల్లెలు.. పట్టించుకోని అధికారులు.. మంచానపడుతున్న ప్రజలు-viral fever is coming in adilabad district due to unsanitary conditions ,తెలంగాణ న్యూస్

0

దోమల స్వైర విహారం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1512 పంచాయతీలు ఉండగా.. ఆదిలాబాద్లో 468, మంచిర్యాలలో 311, నిర్మల్ జిల్లాలో 396, కుమురంభీం ఆసిఫాబాద్ లో 335 పంచాయతీలున్నాయి. వర్షాల కారణంగా పల్లెలన్ని పచ్చదనం సంతరించుకుంటున్నా.. స్వచ్ఛదనం లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పల్లెల్లో ఇండ్ల చుట్టూ మురికినీరు నిల్వ ఉండటం.. ఏపుగా పిచ్చిమొక్కలు పెరగడం.. రోడ్ల పక్కనే గడ్డి మొలవడం.. ఖాళీ స్థలాలు చెత్తచెదారంతో నిండిపోవడం వంటి కారణాలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. మురికి కాల్వలు, అపరిశుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, దోమల మందు ఫాగింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉండగా.. నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి దోమల నివారణకు ఫాగింగ్ చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Exit mobile version