Home తెలంగాణ సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తున్న బుద్ధవనం | buddhavanam a divine feeling to visitors

సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తున్న బుద్ధవనం | buddhavanam a divine feeling to visitors

0

posted on Sep 14, 2024 7:28AM

హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి శ్రీ దాజి కమలేష్ పటేల్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం ఒక అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాలయని అంతర్జాతీయ హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి శ్రీ దాజి కమలేష్ పటేల్ అన్నారు. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని హార్ట్ ఫుల్ నెస్ (రామచంద్ర మిషన్) కేంద్రాన్ని సందర్శించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి ఆహ్వానంపై శ్రీ దాజి బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని మహాస్థూపం లోపల బుద్ధుని పరమ పవిత్రమైన దాతు పేటికలను, బౌద్ధాలయాన్ని సందర్శించారు .బుద్ధవనములోని ప్రధాన ఆకర్షణలైన బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధ ప్రతిమ, స్తూప వనాల గురించి ఆయనకు బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు .మహస్తుపం చుట్టూ ఉన్న శిలాఫలకాలలోని బుద్ధుని జీవిత ఘట్టాలు, ఆయన సంచరించిన ప్రదేశాలు, బౌద్ధానికి చేయూతనిచ్చిన పోషకులు, జాతక కథలు ఇంకా 1700 సంవత్సరాల తరువాత మళ్లీ జీవం పోసుకున్న అమరావతి శిల్పకళ  ప్రాశస్త్యం పై శివనాగిరెడ్డి శ్రీ బాజీకి వివరించగా ఎంతో ఆసక్తిగా విన్నారు. బుద్ధవనం ఏర్పాటు చేసిన  నేపథ్యాన్ని, బౌద్ధ వారసత్వ విలువలను ఈ తరానికి అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని, ఆచార్య నాగార్జున ని తాత్విక చింతనను వ్యాపింప చెయ్యటానికి తీసుకుంటున్న చర్యలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మరియు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రకాశ్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జన్కో సీఎం డి రోనాల్డ్ రోస్ ,ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ విశాలాక్షి  , బయో జెన్ కేర్ డైరెక్టర్ బి పార్థసారథి, బుద్ధవనం అధికారి సుధన్ రెడ్డి, మిర్యాలగూడ డి. ఎస్. పి రాజశేఖర్ రాజు, బుద్ధ వనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version