Home అంతర్జాతీయం Southwest monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్​! నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​..

Southwest monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్​! నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​..

0

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ- ఎప్పటి నుంచంటే..

సెప్టెంబర్ 22 న వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ 2024 ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అదే జరిగితే గత ఎనిమిదేళ్లలో వాయువ్య భారతం నుంచి రుతుపవనాలు ఇంత త్వరగా వైదొలగడం ఇదే తొలిసారి అవుతుంది! గతేడాది సెప్టెంబర్ 25న ఈ ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సెప్టెంబర్​ 30న.. పంజాబ్, ఛండీగఢ్, దిల్లీ, జమ్ముకశ్మీర్, హిమాచల్​ప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్​లని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు ఉపసంహరించుకున్నట్లు ఐఎండీ ప్రకటించింది. అయినప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, ఐఎండీ ముందస్తుగా ఉపసంహరణ ప్రకటన చేసిందని నిపుణులు నాడు అభిప్రాయపడ్డారు.

Exit mobile version