Home తెలంగాణ హరీష్ రావు సహా పలువురు మాజీ మంత్రుల హౌస్ అరెస్టు

హరీష్ రావు సహా పలువురు మాజీ మంత్రుల హౌస్ అరెస్టు

0

posted on Sep 13, 2024 10:29AM

గత రెండు రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మధ్య  జరుగుతున్న మాటలయుద్ధం ముదిరి గురువారం (సెప్టెంబర్ 12) పాకాన పడిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల అంశంపై సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం సాగుతున్నది. గాంధీ ఇంటికెళ్లి బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తానని కౌశిక్‌ శపథం చేశారు. అయితే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు, కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో గురువారం దాదాపు గంటన్నరపాటు అక్కడి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్‌ కమిషనరేట్‌కు హరీశ్‌, కౌశిక్‌ తరలించారు. ఇలా గురువారం అంతా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇలా ఉండగా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చారు. శుక్రవారం (సెప్టెంబర్ 13) గాంధీ ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు.

మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. దీనిపై హరీష్ రావు మండి పడ్డారు. తమ పార్టీ నేతల హౌస్ అరెస్టును ఖండించారు. అరెస్టు చేసిన నేతలు, శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.  ఇలా ఉండగా పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ రాయదుర్గం పోలసులు బీఎన్ఎస్ యాక్ట్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

Exit mobile version