Home తెలంగాణ ప్రేమను పంచే మిలాదున్ నబీ | Miladun Nabi who spreads love

ప్రేమను పంచే మిలాదున్ నబీ | Miladun Nabi who spreads love

0

posted on Sep 13, 2024 12:01PM

పాతబస్తీ పురవీధుల్లో నలుగురు కల్సి  రాత్రిపూట చబుత్రాల మీద కూర్చోవడం రివాజు. అక్బర్ , మెహమూద్ ఒక చబుత్రా మీద కూర్చున్నారు.  మెహమూద్ బర్త్ డే ఉండటంతో అక్బర్ పార్టీ అడిగాడు. ‘ క్రాస్ రోడ్ లోని బవర్చీ దాబా వెళదామా…  బిర్యానీ తిందామా ’అని మెహమూద్ ను అక్బర్ అడిగాడు. మరుసటి రోజే మిలాదున్ నబీ ఉంది కదా బర్త్ డే చేసుకోవడం లేదు నేను అని జవాబిచ్చాడు మెహమూద్. 

రాత్రి పూట బర్త్ డే చేసుకోవడం ఇస్లాంలో లేదు అని చెప్పాడు మెహమూద్.

అదే సమయంలో అక్కడ్నుంచి  వెళుతున్న మౌలానా  చెవిలో  ఈ మాట పడింది. వెంటనే ఆగిపోయాడు. వారిద్దరిని తన దగ్గరికి రమ్మన్నాడు 

  మిలాదున్ నబీ నేపథ్యంలో  మౌలానా ఒక రోజు తక్రీర్ ( ప్రవచనం) నిర్వహించారు.

మిలాదున్ నబీ  అంటే మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సం. అరబ్బీలో జన్మనివ్వడాన్ని మిలాద్ అని సంభోధిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో ఈ పండుగ మూడో నెలలో వస్తుంది. ఆ నెల పేరు రబీ ఆల్ అవ్వాల్ అని పిలుస్తారు.  మహమ్మద్ ప్రవక్త పుట్టింది కేవలం ముస్లింల కోసం కాదు సకల జనుల కోసం. మహమ్మద్ ప్రవక్త మతాలకు అతీతమనే చెప్పొచ్చు.  మహమ్మద్ ప్రవక్త పుట్టింది సౌదీ అరేబియాలో  క్రీస్తు శకం 570 నుంచి క్రీస్తు శకం 632 వరకు. ఆయన పుట్టిన రోజు మరణించిన రోజు ఒకే రోజు కావడం గమనార్హం. 

మానవాళికి ప్రేమ,  ఐక్యతను పంచిన మహమ్మద్ ప్రవక్త  జన్మదినాన్ని ముస్లింలకు చెందిన షియా, సున్నీ తెగలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.  ఈ పండగ సందర్భంగా ఖురాన్ పఠనం విధిగా పాటించాలి. ప్రార్థనలు జరుపుకుంటారు. అన్నదానాలు, రాత్రిపూట కూడా ప్రార్థనలు నిర్వహించడం సర్వ సాధారణం. ముస్లింలలో సలాఫీ, వహబీ సిద్దాంతాలున్నవారు మిలాదున్ నబీని  పర్వ దినంగా జరుపుకుంటారు. 

మెజారిటీ ముస్లిం  ప్రజలు ఇప్పటికీ ఈ రోజును అశుభమైనదిగా భావించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ముస్లింలు దీనిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు.

ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగలలో మిలాదున్ నబీ  ఒకటిగా మారింది. కొందరు మిలాదున్ నబీ వేడుకలు జరుపుకోవడానికి డబ్బుల్లేవు అంటారు. స్నేహితుల కోసం బర్త్ డే వేడుకలు జరుపుకుంటారు. 

భార్య బంగారం కోసం ఖర్చు చేస్తారు.

ముస్లింలకు రెండు రకాల  పెద్ద పండుగలు వస్తాయి. ఒకటి ఈదుల్ ఫితర్(రంజాన్) , రెండోది ఈదుల్ అదా(బక్రీద్ ).ఈ రెండు పండలు శుచి, శుభ్రతకు పెద్ద పీట వేస్తాయి.  ప్రతీ శుక్రవారం  ముస్లింలకు చిన్న పండుగ అని చెప్పొచ్చు. ముస్లింల పండగ  ఖురాన్  ప్రకారం పగటి పూట చేసుకోవాలి. రాత్రిపూట పడుకుని సూర్యోదయం కాగానే పండుగలు చేసుకోవాలి. రాత్రిపూట వేడుకలు జరపడం ఇస్లాంలో లేదు. ఇతర మతాలు కొన్ని మిడ్ నైట్ వేడుకలు జరుపుకుంటాయి. ఇది ప్రమాదకరం. రాత్రి పూట వేడుకల్లో మద్యం, మగువ చేరుతుంది. ఇస్లాంలో ఈ రెండూ  నిషేధం. రాత్రిపూట వేడుకలు జరపడాన్నిఇస్లాం వ్యతిరేకిస్తుంది.  అల్లాకే వాస్తే  యైసా మత్ కరో భాయ్ . మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సహాన్ని ఘనంగా జరుపు కోవాలి అని మౌలానా తన తక్రీర్ లో చెప్పారు. ఆ మరుసటి రోజు జరిగే మిలాదున్ నబీ వేడుకలు మహమూద్, అక్బర్ లు ఘనంగా జరిపారు. అన్నదానాలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. 

 

(ఈ నెల 17న మిలాదున్ నబీ సందర్బంగా)

 

– బదనపల్లి శ్రీనివాసాచారి


 

Exit mobile version