Home తెలంగాణ ఆ ఖర్చులు నేహారెడ్డి నుంచే వసూలు చేయండి.. హైకోర్టు | another big shock to...

ఆ ఖర్చులు నేహారెడ్డి నుంచే వసూలు చేయండి.. హైకోర్టు | another big shock to nehareddy in high court| vijayasai| daughter| illegal| constructions| demolition

0

posted on Sep 12, 2024 3:08PM

అధికారం ఉందన్న అండతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తగు మూల్యం చెల్లించక తప్పదని ఇప్పుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అవగతమౌతోంది. వైసీపీ హయాంలో కొద్ది కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జిగా వెలగబెట్టిన విజయసాయి అడ్డగోలుగా ఆక్రమలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

ఆ ఆరోపణల సంగతి అలా ఉంచితే..  విజయసాయి రెడ్డి  కుమార్తె నేహారెడ్డి భీమిలీ బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత ఐదేళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె, అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకూ, ఆక్రమణలకూ పల్పడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.   ఇప్పటికే   విశాఖ జిల్లా  భీమిలి బీచ్​ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్​ కో ఇవ్వాలంటూ విజయసాయి కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.   అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నేహారెడ్డి  భీమిలీ బీచ్ వద్ద నిర్మించిన గోడను జీవీఎంసీ కూల్చివేసింది.   దీనిపై తదుపరి విచారణలో  ఆ కూల్చివేతకు అయిన ఖర్చు కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే అందుకు సంబంధించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా మొత్తం నిర్మాణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్‌ నోటీసు ఇచ్చామని  నేహారెడ్డి నుంచి ఇంకా స్పందన రాలేదనీ  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కొర్టుకు తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకూ తీసున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.  

Exit mobile version