Home అంతర్జాతీయం Mpox Case In India : భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు.. ఐసోలేషన్‌లో విదేశాల నుంచి...

Mpox Case In India : భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు.. ఐసోలేషన్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి

0

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీపాక్స్ వైరస్ 12 ఆఫ్రికన్ దేశాలలో వ్యాప్తి చెందడాన్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తర్వాత మూడు వారాలకు అనుమానిత Mpox కేసు భారతదేశంలో కనుగొన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో దీనికి సంబంధించిన టీకాలు వేస్తున్నారు. ఈ వైరస్ మశూచిని పోలిన లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మంకీపాక్స్ ఇన్ఫెక్షన్‌కు పూర్తిగా నయం చేసే మందులు లేవు. రోగనిరోధక గ్లోబలిన్, యాంటీ వైరల్ మందులు మంకీ పాక్స్ చికిత్సలో వాడుతారు. మంకీపాక్స్ లక్షణాలు ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయి. జ్వరం, శరీరంపై దద్దుర్లు, వాపు, తలనొప్పి, అలసట ఉంటాయి.

Exit mobile version