పల్నాడు ఇద్దరు మృతి..
పల్నాడు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో విద్యుత్ షాక్‌తో శనివారం ఇద్దరు మృతి చెందారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పొట్లూరు బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో.. విద్యుత్ దీపాలు అలంకరిస్తుండగా స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన పోపూరి దేవ సహాయం విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు విడుకొండలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.